Leading News Portal in Telugu

TDP- Janasena Meeting: నేడు టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల పంపిణీపై కీలక చర్చ



Janasena Tdp

TDP- Janasena: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మార్పులు చేర్పులతో తీవ్ర ఉత్కంఠ రేపుతుండంతో పాటు సిద్ధం సభలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు. మరోవైపు, టీడీపీ- జనసేన కూటమి ఈసారి అధికారం దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేసుకున్నట్లు కనిస్తుంది. అందులో భాగంగనే ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నాయి. అయితే, టీడీపీ- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయానికి రాలేదు. పొత్తును ముందుకు తీసుకెళతాం అని టీడీపీ, జనసేన అగ్రనేతలు చెప్తున్నారు.. కానీ, ఇరు పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల్లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది.

Read Also: Raviteja : ఆ స్టార్ హీరోలకు పోటీగా రవితేజ కొత్త బిజినెస్..

కాగా, ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తుండటంతో.. ఇవాళ విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ కీలక భేటీ కాబోతుంది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య పాల్గొనగా.. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, యశస్విని హాజరుకాబోతున్నారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించే అవకావం ఉంది. అలాగే, జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.