
సోషియల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రమణధీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ధీక్షితులు, కృష్ణశేషాచల ధీక్షితులు స్పందించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలధీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రమణధీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని, రంగనాయకులు మండపంలో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణధీక్షితులు తరుచు ఆరోపణలు చేస్తూన్నారని, రమణధీక్షితులును సియం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదన్నారు.
Bhama Kalapam 2: ప్రియమణి ‘భామా కలాపం 2’ సంచలనం..ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్
రమణధీక్షితులు కుటుంబంలో ఎవ్వరు కూడా విధులుకు హజరుకావడం లేదన్నారు. తాలు మాత్రం తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. టీషర్ట్, లుంగి ధరిస్తే క్రిస్టియన్ గా పేర్కోన్న రమణధీక్షితులు ఆరోపణలు చేసే సమయంలో ధరించినవి కూడా టీషర్ట్, లుంగియ్యే అని ఆయన అన్నారు. టీటీడీ ఉదాసీనంగా వ్యవహరిస్తూండడంతోనే రమణధీక్షితులు తరుచు ఆవాస్త ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రమణధీక్షితులు పై టీటీడీ చర్యలు తీసుకోని భక్తుల మనోభావాలను కాపాడాలన్నారు. కృష్ణశేషాచలధీక్షితులు మాట్లాడుతూ.. రమణధీక్షితులు ఆలయంలో మరమ్మతు పనులు జరిగిపోయ్యిందని ఆరోపణలు చేసిన పనులని కూడా రమణధీక్షితులు హయంలో జరిగినవేనని, శ్రీవారి ఆలయంలో నిత్యం ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తూన్నామని ఆయన పేర్కొన్నారు.
Warren Buffet : క్రెడిట్ కార్డ్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించేందుకు వస్తున్న వారెన్ బఫెట్