Leading News Portal in Telugu

Srisailam Temple Trust: టీటీడీ తరహాలో శ్రీశైలానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి.. ట్రస్ట్‌ బోర్డ్‌ తీర్మానం..



Srisailam

Srisailam Temple Trust: శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డ్‌ సమావేశంలో కీలక తీర్మానం చేశారు.. శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది. అనంతరం మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశారు.. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించామని వెల్లడించారు ఆలయ చైర్మన్‌ చక్రపాణి రెడ్డి.. అలాగే శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం, వాణిజ్య సముదాయానికి రూ.8 కోట్ల 60 లక్షలకు ఆమోదించారు. వీటితోపాటు సున్నిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతిగృహాలకు నీటి సరఫరాకి ఏర్పాటుకు అంచనా వ్యయం రూ. 15 కోట్లు ఆమోదించారు. క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీరు పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయశాఖకు ప్రతిపాదనలకు తీర్మానించారు. అలానే దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాకు తెలిపారు.

Read Also: TDP-Janasena: 28న టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌