
Hyderabad Crime: హైదరాబాద్‌లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న యువతిని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. తనని ప్రేమించలేదన్న అక్కసుతో ఓ న్యాయవాదితో పాటు అతడి కూతురి న్యూడ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియోలో పోస్టు చేసింది. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతూ పాడుపనులు చేసిన యువతిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత దారుణమైన రీతిలో న్యూడ్ ఫోటోలను తయారు చేసి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌తో పాటు పలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. న్యాయవాది కుటుంబసభ్యులందరి న్యూడ్ ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఐఏఎస్ కోసం కోచింగ్ తీసుకుంటూ.. న్యాయవాదిపై అక్కసుతో ఇలాంటి పాడుపని చేసినందుకు ఆ యువతని అరెస్ట్ చేశారు పోలీసులు.