
Kodali Nani: కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు.. తాజాగా, నారా భువనేశ్వరి కామెంట్స్ పై కొడాలి నాని సెటైర్లు వేశారు.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యే కోరింది.. భువనేశ్వరి తన మనసులో ఉన్న మాటనే బయటపెట్టింది.. ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలి.. ఎన్టీఆర్ మీద , ఆయన కుమార్తె మీద గౌరవంతో ఐదుకోట్ల మంది కలిసి చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం అంటూ వ్యాఖ్యానించారు..
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
ఎన్టీఆర్ పిల్లలు బాబుగారికి రెస్ట్ కావాలని అడుగుతున్నారు.. రాజశేఖర్ రెడ్డిగారి అబ్బాయి.. బాబుగారికి రెస్ట్ ఇవ్వాలని అడుగుతున్నారు.. ఇద్దరు అగ్రనాయకులు పిల్లలూ చంద్రబాబుకు రెస్ట్ కావాలంటున్నారు.. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకుని చంద్రబాబుకు రెస్ట్ ఇప్పిద్దాం అంటూ పేర్కొన్నారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పచెబుతాం అంటూ సెటైర్లు వేశారు.. ఇక, ఎవరు ఎంతమందితో కలిసివచ్చినా 2024లో చంద్రబాబుకు రెస్ట్ తప్పదు అంటూ జోస్యం చెప్పారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, కుప్పం పర్యటనలో ఎన్టీఆర్ క్యాంటిన్‌ను ప్రారంభించిన నారా భువనేశ్వరి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. సరదా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. ఇన్ని ఏళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు.. ఆయనకి రెస్ట్ ఇద్దాం.. నన్ను గెలిపిస్తారా? చంద్రబాబును గెలిపిస్తారా? అంటూ సభకులను అడిగి సమాధానాన్ని రాబట్టిన విషయం విదితమే.