Leading News Portal in Telugu

Perni Nani: మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్



Perni Nani

Perni Nani: మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర ఓటమి భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. పాపపు సొమ్ముతో చండి యాగాలు, పూజలు చేయడం కాదని.. 3 స్తంభాల సెంటర్ నుంచి బైపాస్ రోడ్లో పేదలకు స్థలాలు ఇచ్చింది నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Yemmiganur: టీడీపీ పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ బీసీలకే కేటాయించాలి: బీసీ ఐక్యవేదిక

అనుమతి లేకుండా శంకుస్థాపన చేసిన మీరు పోర్ట్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నవయుగ సంస్థను అడ్డం పెట్టుకొని కోర్టులో పోర్ట్ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. అక్కడ అది కడతాం యిక్కడ యిది కడతాం అంటూ మోటార్ సైకిల్‌పై వెళ్లి గోడలకు రేకులు కొట్టడం కాదన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు సీటు రాకుండా చేసింది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు. బహిరంగ చర్చకు రమ్మంటున్నావు నీలాంటి స్థాయి లేని వాడితో, గతి లేని వాడితో నాకు చర్చ ఏంటని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గతి లేక నీ మీద పోటీ చేయక తప్పట్లేదన్నారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవు అధికారులు చింతచెట్టు లా మీ ఊపులకు కదలరంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని.