
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావుని ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు శనివారం ఉదయం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉంగుటూరు మండలం పొనుకుమాడులోని శ్రీ గంగా సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలుసుకొన్న చుట్టుపక్కల గ్రామాల మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చి దారి పొడవునా వెంకట్రావుని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతు వెంకట్రావుకే ఉంటుందని తెలిపారు.
Congress : ఖమ్మం పార్లమెంట్ స్థానంపై కన్నేసిన కాంగ్రెస్..!
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ 151 స్థానాల్లో పోటీ చేయనుండగా, మిగిలిన 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నారా లోకేష్ మంగళగిరి నుంచి, టీడీపీ అధినేత కుప్పం నుంచి పోటీ చేయనున్నారు. అయితే, పార్టీ కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లయితే, బిజెపిని సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు జరిగిందని ఇద్దరు నేతలు చెప్పారు.
MP Vijayasai Reddy: 3న మేదరమెట్లలో సిద్ధం సభ.. 15 లక్షల మందికి పైగా వస్తారు..!