Leading News Portal in Telugu

Protest Against TDP-Janasena First List: టీడీపీ – జనసేన తొలి జాబితా.. ఆ 9 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు..!



Protest

Protest Against TDP-Janasena First List: ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న టీడీపీ – జనసేన.. ఉమ్మండిగా తొలి జాబితాను ప్రకటించాయి.. అయితే, అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ జిల్లాల్లో.. నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. మొత్తం 99 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ-జనసేన. కానీ.. తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి.. ఎనిమిది సెగ్మెంట్లల్లో టీడీపీ.. ఒక నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తుల ఆందోళనకు దిగారు.. గజపతినగరం, కళ్యాణదుర్గం, పెనుకొండ, అనకాపల్లి, పి.గన్నవరం, రాయచోటి, తెనాలి సెగ్మెంట్లల్లో టీడీపీ నేతల ఆందోళన చేస్తుండగా.. పెడనలో బూరగడ్డ వేదవ్యాస్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

Read Also: Delhi: పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి.. ఢిల్లీలో ఘటన

ఇక, గజపతినగరంలో కేఏ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆందోళనకు చేస్తుండగా.. కళ్యాణదుర్గంలో చంద్రబాబు ఫ్లెక్సీలు తగుల బెట్టారు ఉన్నం హనుమంతరాయ చౌదరి అనుచరులు. తీవ్ర నిరాశలోకి వెళ్లారు పెడన సీటును ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్‌. పెనుకొండ భగ్గుమంది.. పెనుకొండ టికెట్ ఆశించిన బీకే పార్ధసారథిని హిందూపురం ఎంపీగా పంపే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. అనకాపల్లిలో పీలా గోవింద్‌ వర్గీయులు ఆందోళన చేశారు.. సాయంత్రానికి తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్న పీలా గోవింద్ ప్రకటించారు. పి.గన్నవరం తమ పదవులకు.. పార్టీకి రాజీనామా చేశారు తోలేటి సత్తిబాబు.. రాయచోటిలో రమేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.. ఆలపాటి రాజా అలకమాన్పు ఎక్కారు.. రేపు కార్యకర్తల సమావేశం పెట్టేందుకు ఆలపాటి రాజా సిద్ధం అయ్యారు.. ఇక, జగ్గంపేటలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు.. గుంభనంగా ఉన్నారు కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, జలీల్‌ ఖాన్‌, బుద్దా వెంకన్న.. గంటా శ్రీనివాసరావు, మండలి బుద్దాప్రసాద్‌, యరపతినేని, చింతమనేని, బండారు సత్యనారాయణ మూర్తి.. దీంతో.. ఆయా నియోజకవర్గాల్లో కూడా వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.