
ఛలో విజయవాడకు బ్రేకులు వేయనున్నాయి ఏపీఎన్జీఓ, అనుబంధ సంఘాల జేఏసీ. ఎల్లుండు జరగాల్సిన ఛలో విజయవాడకు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టులు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక మెట్టు దిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లోని అంశాలు వ్రాతపూర్వక మినిట్స్ ఇస్తాం అన్నారన్నారు. 27న జరగాల్సిన ఛలో విజయవాడ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు.
మా 49 డిమాండ్లు రెండు వారాల్లో పరిష్కరిస్తాం అన్నారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రయారిటీ లో తీసుకున్నారన్నారు. పెన్షనర్ల అంశంలో అతి త్వరలో ఉత్తర్వులిస్తాం అన్నారని, మా 49 డిమండ్లు సీఎస్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వం రెండు దఫాలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సి్ నిర్వహించిందని, మేం మా డిమాండ్లను బలంగా వినిపించామన్నారు. ఈనెల 24న జరిగిన జీఓఎం లో పీఆర్సీ సరాసరి ఇస్తామని ఆయన తెలిపారు. పీఆర్సీ ఇచ్చే ఆనవాయితీ లేదు అన్నారని, మన్మోహన్ సింగ్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం అని తెలిపారన్నారు.