Leading News Portal in Telugu

Chandrababu : తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్



Chandrababu Naidu

తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చ, ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఓ సర్వే చేపడతామని చంద్రబాబు వెల్లడించారు. సర్వేల్లో ఏమైనా తేడా వస్తే.. అభ్యర్థులను మార్చేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. టిక్కెట్లు వచ్చేశాయని నిర్లక్ష్యం తగదన్న చంద్రబాబు తెలిపారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు.. ప్రభుత్వ విధానాలతో పాటు.. స్థానిక ఎమ్మెల్యేల పని తీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. జనసేన క్యాడర్‌తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలన్నారు చంద్రబాబు. పార్టీ అభ్యర్ధులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలి అని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు చంద్రబాబు.

Indian Air Force : పూణే నుంచి ఢిల్లీకి కాలేయం.. మాజీ సైనికుడి ప్రాణాలు కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
సిద్దం అని సభలు పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడని, ఎంత సీనియర్ నేతైనా.. నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలున్నా చివరి నిముషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలని చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకలు, కార్యకర్తలను మీరు కలుపుకుని పోవాలని సూచించారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పది సార్లు స్వయంగా వెళ్లి మీరే కలవాలన్నారు. నేనే అభ్యర్థి కదా అని ఈగోతో వ్యవహరిస్తే కుదరదని స్పష్టీకరించారు. తటస్థులు కలవాలని.. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరండని, దొంగ ఓట్లను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలని, ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడన్న చంద్రబాబు వ్యాఖ్యానించారు.

TSPSC Group 2024: గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా..? సిలబస్ ఇదే..!