Yarlagadda Venkat Rao: విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో వెళ్లి పైపుల రోడ్డులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యార్లగడ్డ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రకటించిన ఆరు హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Also: CM YS Jagan: 35 ఏళ్లుగా కుప్పానికే ఏమీచేయని వ్యక్తి.. రాష్ట్రానికి ఏం చేస్తారు..?
తదనంతరం స్థానిక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచి గండికోట సీతయ్య ఆధ్వర్యంలో 100 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా.. యార్లగడ్డ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గొడ్డల చిన్న రామారావు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబురావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గొడ్డల సత్యనారాయణ, కార్యదర్శి రాజు, ఎస్టీ సెల్ కార్యదర్శి పెండ్రాల పుల్లయ్య, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.