
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ.. ఆయన్ను పదవి నుంచి తొలగించింది. మరోవైపు.. రమణ దీక్షితులుపై అహోబిలం మఠం, జియ్యంగార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్‌లపై నీచమైన ఆరోపణలు చేశారని, దీంతో రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయించినట్లు చైర్మన్ భూమన తెలిపారు.
Read Also: Husbands Being Beaten: భర్తలను భార్యలు ఎక్కువగా చితకబాదేది ఎక్కడో తెలుసా..!
మరోవైపు.. రమణ దీక్షితులు చేసిన వీడియోలో అంశాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఉన్నాయంటూ బీసీయూ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. రమణ దీక్షితులను గతంలో గౌరవ ప్రధాన అర్చకుడిగా వైసీపీ ప్రభుత్వం నియమించింది. ఇదిలా ఉంటే.. సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
Read Also: Bengaluru: ఆన్లైన్లో 4 డజన్ల గుడ్లు కొనుగోలు చేసి రూ.48వేలు పోగొట్టుకున్న మహిళ..