Leading News Portal in Telugu

Hanuma Vihari: ఆంధ్ర రంజీ జట్టుకు హనుమ విహారి వీడ్కోలు..



Vihari

ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పారు. భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.

Indian Railway: నిరుద్యోగులకు రైల్వేశాఖ కీలక అలర్ట్

2023-24 రంజీ సీజన్లో మొదటి మ్యాచ్ బెంగాల్తో గెలిచిన తర్వాత తనను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అసోసియేషన్ కోరిందని చెప్పాడు. జట్టులో 17వ సభ్యుల పైన అరవడం కారణమే కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసిందని తెలిపాడు. జట్టులో 17వ సభ్యుడు ఓ రాజకీయ నాయకుడు కుమారుడు అని చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ జట్టు పై ఉన్న అభిమానం, క్రికెట్ పై ఉన్న ప్రేమతో ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని విహారి పేర్కొన్నాడు.
గత సీజన్లో కుడి చేతికి దెబ్బ తగిలినప్పటికీ… ఎడమ చేతితో బ్యాటింగ్ చేసిన తనకు అసోసియేషన్ చేసిన అవమానం తట్టుకోలేకపోతున్నానని అన్నాడు. నా ఆత్మ అభిమానాన్ని పోగొట్టుకున్న ఆంధ్ర జట్టులో ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఆంధ్ర జట్టును, క్రికెట్ను ఎప్పుడు గౌరవిస్తానని అన్నాడు. ప్రతి సీజన్లో మనం ఎదుగుతున్న విధానాన్ని నేను ఇష్టపడినా.. అసోసియేషన్ మనం ఎదగాలని కోరుకోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశాడు.

PayTM Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా

2018లో టీమిండియా టెస్టు జట్టులో అరంగేట్రం చేశాడు. విహారి ఇప్పటివరకు 16 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో ఓడిపోయే స్థితిలో ఉన్న టీమిండియాను విహారి వీరోచిత పోరాటం చేసి గెలిపించాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. విహారి అత్యధిక స్కోరు 111. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇక 114 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 53.02 సగటు, 48.54 స్ట్రైక్‌రేట్‌తో 8643 పరుగులు చేశాడు. అందులో.. 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్ కూడా వేస్తాడు. టీమ్‌ఇండియా తరఫున 10 ఇన్నింగ్సుల్లో 5 వికెట్లు తీశాడు. ఫస్ట్‌ క్లాస్‌లో 27, లిస్ట్‌ ఏలో 22, టీ20ల్లో 26 వికెట్లు పడగొట్టాడు.