
నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలకు ఎక్కడా విలువ లేదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారు.. తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాలలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. ఎస్సీ వర్గీకరణకు ఎవరు మద్దతిస్తే వారికి ఎమ్మార్పీఎస్ తరఫున ఆ పార్టీకి మద్దతిస్తాని తెలిపారు.
Read Also: Rajnath Singh: రేపు ఏపీలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
తెలంగాణలో వికలాంగులకు పెన్షన్ రూ.6 వేలకు ప్రభుత్వం పెంచిందని.. ఆంధ్రప్రదేశ్ లో కూడా వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ అమలు చేయాలని కోరారు. లేదంటే.. మార్చి 9 తేదీన చలో అమరావతి నిర్వహిస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. మార్చి 9న చలో అమరావతికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలే కాకుండా, అన్ని వర్గాల వారితో మాట్లాడి అందరూ వచ్చేలాగా ప్రయత్నించండని పేర్కొన్నారు.
Read Also: Nellore: పార్టీ కోసం ఎన్నో చేశాం.. జిల్లాలో ఒక్క స్థానం కేటాయించకపోవడంపై ఆందోళన
మరోవైపు.. వంద సంవత్సరాల క్రితమే మాలల అభివృద్ధికి బీజం పడిందని మంద కృష్ణ తెలిపారు. మాదిగల కోసం 30 సంవత్సరాల క్రితం బీజం పడిందని చెప్పారు. మాలల వల్ల మాదిగలు ఎప్పుడూ వెనుకబడి పోతున్నారని పేర్కొన్నారు. త్వరలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ పై తీర్పు వస్తుందని చెప్పారు. అయితే.. రాబోవు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకు ఎవరు మద్దతు ఇస్తారో, ఆ పార్టీకే ఎమ్మార్పీఎస్ సహకరిస్తుందని మంద కృష్ణ మాదిగ తెలిపారు.