Leading News Portal in Telugu

Rajnath Singh: రేపు ఏపీలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే



Rajnath

కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి.. విశాఖ, విజయవాడ, ఏలూరు పర్యటనలకు వెళ్లనున్నారు.

Read Also: Nellore: పార్టీ కోసం ఎన్నో చేశాం.. జిల్లాలో ఒక్క స్థానం కేటాయించకపోవడంపై ఆందోళన

షెడ్యూల్ ఇదే..
విశాఖలో VUDA చిల్డ్రన్స్ థియేటర్లో 12 గంటలకు మేధావుల సమావేశం.
మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నుంచి విజయవాడ చేరుకుంటారు.
విజయవాడలో ఒక హోటల్లో బీజేపీ ఏపీ లోక్సభ స్థానాల కోర్ కమిటీతో సమావేశం కానున్నారు.
సాయంత్రం 5:10కి ఏలూరు ఇండోర్ స్టేడియంకు చేరుకోనున్నారు.
ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్నారు.
సాయంత్రం 7:10 కి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు.