
8 MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. వైసీపీ రెబల్, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లపై ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్.. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారణ జరిపిన స్పీకర్.. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు.. ఇక, వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణను ముగించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చాయి వైసీపీ, టీడీపీ.. వైసీపీ పిటిషన్ లో ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ, ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. టీడీపీ పిటిషన్‌లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ఉన్నారు..
Read Also: TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
మొత్తంగా పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకేసారి అనర్హత వేటు వేశారు. కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్, కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం.. పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు.. వారిని నుంచి వివరాలు తీసుకున్నారు.. మరికొన్ని సందర్భాల్లో విచారణ దూరంగా ఉన్నారు రెబల్ ఎమ్మెల్యేలు.. ఈ తరుణంలో విచారణ ముగిసినట్టేనని ప్రకటించిని స్పీకర్.. ఆ తర్వాత న్యాయనిపుణుల సలహా తీసుకుని.. ఒకేసారి 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్టు వెల్లడించారు.. స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.