
టీడీపీ అధినేత చంద్రబాబును వివిధ జిల్లాలకు చెందిన ఆశావహులు, నేతలు కలిశారు. టీడీపీకి సంబంధించి టిక్కెట్ల ప్రకటన అనంతరం నేతలతో చంద్రబాబు వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని వారికి సూచిస్తున్నారు. సీటు రాలేదు అంటే.. పార్టీ వద్దు అనుకున్నట్లు కాదని నేతలకు చెబుతున్నారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధినేత నేతలకు వివరించారు. ఈ క్రమంలో.. భేటీ అనంతరం పార్టీ అభ్యర్థుల గెలుపుకు పని చేస్తామని పలువురు నేతలు చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
TDP-Janasena: తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సభ..
రాయచోటి నియోజకవర్గం టిక్కెట్ టీడీపీ రాం ప్రసాద్ రెడ్డికి ఇచ్చింది. ఈ క్రమంలో.. రాం ప్రసాద్ రెడ్డికి సహకరించాలని నియోజకవర్గంలోని ముఖ్యనేత ప్రసాద్ కు చంద్రబాబు సూచించారు. ఇద్దరు నేతల చేతులు కలిపి సీటు గెలిచి రావాలంటూ తెలిపారు. మరోవైపు.. సింగనమల టిక్కెట్ బండారు శ్రావణికి టీడీపీ ప్రకటించింది. సింగనమల నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కేశవ్ రెడ్డి, నర్సానాయుడులను చంద్రబాబు పిలిచి మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి శ్రావణి గెలుపుకు సహకరించాలని సూచించారు. పొత్తులో భాగంగా నెల్లిమర సీటు జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో.. నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు చంద్రబాబును కలిశారు. పొత్తులో భాగంగా సీటు ఇవ్వాల్సి వచ్చిందని.. జనసేన గెలుపునకు పని చేయాలని చంద్రబాబు సూచించారు.
BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. సైకిలెక్కిన ఎర్రబోతుల వర్గీయులు..!
ఇదిలా ఉంటే.. పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని.. పొత్తులో సీటు కోల్పోయిన వారికి తప్పక న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు. కాగా.. కర్నూలు పార్లమెంట్ నేతలు బానుశంకర్, బస్తిపాటి నాగరాజు చంద్రబాబును కలిశారు. అటు.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నంద్యాల పార్లమెంట్ నాయకుడు కె.వి. సుబ్బారెడ్డి కూడా కలిశారు. వారితో పాటు.. జెసి పవన్, రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి చంద్రబాబును కలిశారు. మరోవైపు.. సీటు ఇవ్వకపోవడంతో తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అధిష్టానాన్ని కలిశారు. ఈ క్రమంలో.. సీట్ల విషయంలో చంద్రబాబు పలువురు నేతలకు క్లారిటీ ఇస్తున్నారు. అంతేకాకుండా.. అసంతృప్తిగా ఉన్న నేతలతో స్వయంగా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. టిక్కెట్ల ప్రకటన అనంతరం 10-15 చోట్ల నేతలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం కొంతమంది పార్టీ నేతలు మెత్తబడ్డారు. పార్టీ కోసం పని చేస్తామని పలువురు హామీ ఇచ్చారు.