Leading News Portal in Telugu

Daggubati Purandeswari: అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు: పురందేశ్వరి



Daggubati Purandeswari

ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారిత‌ కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలని, కండువా వేసుకోవడమే‌ కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలని ఆమె చెప్పారు. కృష్ణా జిల్లా నుంచి బీజేపీలో చేరికలు జరిగాయి. వారికి పార్టీ కండువా కప్పి పురందేశ్వరి బీజేపీలోకి ఆహ్వానించారు.

బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ… ‘ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగింది. అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పధకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మహిళల సాధికారిత‌ కోసం మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. మోడీ హయాంలో డ్వాక్రా రుణాలను రూ. 20 లక్షల వరకు పెంచారు. తద్వారా ఒక్కో మహిళకు లక్ష నుంచి రెండు లక్షల దాకా‌ వస్తున్నాయి. మహిళా‌ సాధికారితపైన మోడీకి ప్రత్యేక శ్రద్ధ ఉంది’ అని అన్నారు.

Also Read: NZ vs AUS: చరిత్ర సృష్టించిన నాథన్‌ లియోన్‌.. ప్రపంచంలో ‘ఒకే ఒక్కడు’!

‘పొలాల్లో ఎరువులు, పురగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించింది ప్రధాని మోడీనే. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారు. మహిళలను ఏదో సంరక్షిస్తున్నామనే‌ విధంగా కాకుండా.. వాళ్ల కాళ్ల మీద నిలబడేలా మోడీ వ్యవహరిస్తున్నారు. మహిళలకు అన్ని విధాలుగా ప్రధాని అండగా నిలిచారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలి. కండువా వేసుకోవడమే‌ కాదు కండువా బాధ్యత కోసం పని చేయాలి. అప్పుడే పార్టీ బలోపేతం చెందుతుంది’ అని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు.