Leading News Portal in Telugu

Machani Somnath: మాచాని సోమనాథ్‌కు పూర్తి మద్దతు తెలిపిన నేతన్నలు



Machani Somanath

Machani Somnath: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది సంఖ్యలో చేనేతలు కలిసి ర్యాలీగా బయలుదేరి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ చేనేత ఆత్మీయ సమ్మేళనలో వేలాదిమంది చేనేతలు పాల్గొని వారి పూర్తి మద్దతును తెలియజేశారు. చేనేతల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడుతానని మాచాని సోమనాథ్‌ తెలియజేశారు.

 ఎమ్మిగనూరు పట్టణాన్ని టెక్స్‌టైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మిగనూరులో చేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా కేఎస్‌వీ శివన్న వహించగా, ముఖ్య అతిథులుగా బీఎల్ నాగిరెడ్డి, మాచాని ఆదిత్య, లింగప్ప, అడ్వకేట్ మాచాని పరమేశప్ప, పద్మశాలి సంఘం నుంచి శివదాస్, నారాయణ, సరోజమ్మ, నర్సమ్మ బండ భాస్కర్‌, మాస్టర్ వ్యూవర్స్ నజీర్ వెంకటేష్, నందవరం పంపయ పాల్గొన్నారు.