Leading News Portal in Telugu

Mylavaram: మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు..



Mylavaram

Mylavaram: ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతూ ఉంది.. ఇక, కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీలో రచ్చ నడుస్తోంది.. సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వర్సెస్‌ తాజాగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌గా పరిస్థితి మారింది. టీడీపీలోకి వసంత ఎంట్రీతో మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఇప్పుడు వసంత రాకతో కలిసిపోయారు.. ఇంతకుముందు ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు టికెట్‌ ఆశించారు.. ఒకప్పుడు ఉప్పు, నిప్పుగా ఉండేవారు. అయితే, వసంత రాకతో ఇద్దరూ కలిసిపోయారు.. మరోవైపు.. వసంత కృష్ణప్రసాద్‌ ఎంట్రీతో ముగ్గురు మధ్య పోటీనెలకొన్నట్టు అయ్యింది. ఇంతకు ముందు.. దేవినేనికి టికెట్‌ ఇవ్వొద్దంటూ కార్యక్రమాలు నిర్వహించారు బొమ్మసాని.. ఇక, వసంత రాకతో.. వ్యతిరేక వర్గం ఒక్కటైంది.. ఇద్దరం కలిసి పనిచేస్తామని.. దేవినేని, బొమ్మసాని ప్రకటించారు.. ఇవాళ ఒకే వేదికపై దేవినేని ఉమా, బొమ్మసాని కనిపించబోతున్నారు.. మరోవైపు టీడీపీ అధికారంలోకి వచ్చేవరకు విశ్రమించేది లేదంటున్నారు. అయితే, తొలి లిస్ట్‌లో మైలవరం అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది టీడీపీ అధిష్టానం.. రెండో లిస్ట్‌లో మైలవరం అభ్యర్థిని ప్రకటించాలని లోకల్ లీడర్లు కోరుతున్నారు.