Leading News Portal in Telugu

Gummanur Jayaram: టీడీపీలో చేరిన మంత్రి జయరాం.. తొలి స్పందన ఇలా..



Gummanur Jayaram

Gummanur Jayaram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి పదవితో పాటు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ హాజరైన జయహో బీసీ సభకు హాజరైన ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.. బడుగులకు స్వతంత్రం రావాలి.. టిక్కెట్లు బడుగులకిచ్చి.. అగ్ర కులాలకు ఇంఛార్జీలను ఇస్తే స్వతంత్రం ఉంటుందా..? అని టీడీపీ చేరిన తర్వాత వ్యాఖ్యానించారు మంత్రి గుమ్మనూరు జయరాం.

Read Also: Minister Buggana Rajendranath Reddy: భారత్‌లోనే విశాఖ అన్ని ప్రాధాన్యతలు వున్న నగరం..

కాగా, వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. తొలిసారి ఈ రోజు ఓ మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు.. మంత్రి గుమ్మనూరు జయరాం ఈ రోజు.. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం విదితమే.. ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం పేర్కొన్నారు.. సీఎం వైఎస్‌ జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని.. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పం లాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. ఇక, ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్ తనను కోరారని, కానీ, ఆ ప్రతిపాదన తనకు నచ్చలేదని గుమ్మనూరు జయరాం తెలిపిన విషయం విదితమే. మరోవైపు.. జయహో బీసీ సభ వేదికగా గుమ్మనూరు జయరాం ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..