
కొందరు నన్ను నెల్లూరు నుంచి పంపించేశారు అని అంటున్నారు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుమతి తీసుకుని మళ్ళీ నెల్లూరుకు వస్తా.. ఇక్కడ కొన్ని లెక్కలు సరి చేయాల్సి ఉంది.. రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజక వర్గం వైసిపి కి అడ్డా.. రాష్ట్రంలోనే మొదట వైసీపీ గెలిచే రెండు సీట్లు నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజక వర్గం అని తెలిపారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజక వర్గానికి ఇంఛార్జీగా వచ్చిన తర్వాతే నేరాలు, కుట్రలు తగ్గి పోయాయన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్ కు ఇద్దరు మాత్రం జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలి.. నేను, రూరల్ నియోజక వర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతో మంది నేతలు మాకు టికెట్ ఇవ్వొద్దని చెప్పినా జగన్ వినలేదు అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
Read Also: Car Parking: ఆ రాష్ట్రంలో కారు పార్కింగ్ చెయ్యాలంటే వెయ్యి కట్టాల్సిందే..ఎక్కడంటే?
సీఎం జగన్ వల్లే తాము ఎమ్మెల్యేలు అయ్యాం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నేను శ్రీధర్ రెడ్డి గురించి నేను మాట్లాడకూడదు అనుకున్న కానీ తప్పడం లేదు.. ఫోన్ ట్యాపింగ్ అని శ్రీధర్ రెడ్డి అబద్ధాలు చెప్పినప్పుడు.. అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్ అని నిరూపిస్తానని నేను సవాల్ చేశాను.. ఒక్కడినే లక్ష మందిని కలుస్తానని చెబుతున్న రూరల్ ఎమ్మెల్యే రోజుకు ఎంత మందిని కలుస్తున్నాడు అని ఆయన ప్రశ్నించారు. వేమిరెడ్డికి డబ్బు ఉందని అహం గర్వం.. దైవ కార్యక్రమాలు చేశానని చెప్పుకుంటున్నాడు.. వేమిరెడ్డి పాపాలు చేశాడు కాబట్టే అవి చేస్తున్నాడు.. నా మీద రెండు సంవత్సరాల పాటూ జగన్ కు చాడీలు చెప్పి చెప్పి నన్ను జిల్లా నుంచి తరిమే దాకా నిద్ర పోలేదన్నారు. నేను కొన్ని కారణాలతో నరసారావుపేటకు పోయా అంతే.. పోతూ పోతూ ఒక మైనారిటీని ఎమ్మెల్యే అభ్యర్దిగా పెడితే దానికి అలిగాడు.. అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి పోగానే కేడర్ లో కొంత నిరుత్సాహం కలిగిందని అనుకున్నారు అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Navneet Kaur: ఎంపీ నవనీత్ కౌర్‌కు బెదిరింపులు
కానీ విజయసాయి రెడ్డి పేరు రాగానే వాళ్ళందరికీ భయం పట్టుకుంది అని మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్ కమార్ యాదవ్ పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2016లో జిల్లాలో అడుగు పెట్టాకే ఆయన లెగ్ మహిమతో పార్టీ చెల్లా చెదురైంది.. ఆయన పార్టీ నుంచి పోయాకే మళ్ళీ అంతా కలిశాం.. వేమిరెడ్డి సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్లు పెట్టలేదు.. సీఎస్ఆర్ డబ్బులతో పెట్టాడు అని తెలిపాడు. CSR నిధులు కాకుండా సొంత డబ్బులు పెట్టానంటూ చెప్పమనండి.. టీడీపీ పార్టీలో చేరిన వారు దొంగలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతో నేను ఏమైనా చేస్తా అని చెప్పే వారికి రాబోయే ఎన్నికల్లో బీసీలు, మైనార్టీలు తగిన బుద్ది చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ కోరారు.