Leading News Portal in Telugu

Off The Record : Tirupati సీటు కోసం TDP – Janasena నేతల్లో ఎందుకంత తాపత్రయం..?



Otr Tdp

ఆ సీటు యమా… హాట్‌. హాటంటే.. అలాంటిలాంటి హాట్‌ కాదు గురూ… అంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు. అందుకే రెండు పార్టీల నుంచి డజన్‌ మంది మాక్కావాలంటే మాకంటూ పోటీలు పడుతున్నారు. ఎవరి లెక్కలతో వారు లాబీయింగ్‌ చేస్తున్నారు. పోటీ తట్టుకోలేక చివరికి లోకల్‌ ముద్దు, నాన్‌ లోకల్‌ వద్దన్న నినాదాన్ని కూడా తెర మీదికి తెచ్చారు. ఇంతకీ ఏదా హాట్‌ సీట్‌? ఏంటి అక్కడ స్పెషల్‌? తిరుపతి ఆధ్యాత్మికంగా ఎంత ఫేమస్సో…. పొలిటికల్‌గా ఈ అసెంబ్లీ నియోజకవర్గం అంత సెంటిమెంట్‌. రాజకీయ నేతలకు ఇది ఎప్పుడూ హాట్‌ సీటే. ఎన్టీఆర్‌, చిరంజీవి లాంటి నేతలు సెంటిమెంట్‌గా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఒకప్పుడు టీడీపీ కంచుకోట. కొన్నేళ్ళుగా ఈ సీటును బలిజలకే కేటాయిస్తోంది పార్టీ. గత ఎన్నికల్లో కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగుణమ్మ పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో ఆమే భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి మాత్రం సీటు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పార్టీ అధిష్టానం. ప్రస్తుతానికైతే సుగుణమ్మే ఇన్ఛార్జ్‌గా ఉన్నారుగానీ… సీటు ఆమెకేనన్న గ్యారంటీ లేదన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన సైతం టికెట్ రేసులో ఉండటంతో అధినేతల నిర్ణయంపై రెండు పార్టీల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో సుగుణమ్మతోపాటు జేబీ శ్రీనివాస్, ఇంకో ఏడుగురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సీటు కోసం తిరుపతి టూ విజయవాడ జర్నీ వీరికి రొటీన్‌గా మారిందట.

 

దీంతో కంచుకోటలో పార్టీకి ఏంటీ పరిస్థితి అని టీడీపీ కేడర్‌ తలబాదుకుంటున్నట్టు తెలిసింది. అటు జనసేనలోను ఇన్ చార్జ్ కిరణ్ రాయల్, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మధ్య పోటీ ఉంది. ఇలా.. రెండు పార్టీల నుంచి దాదాపు పదిమంది నేతలు టెంపుల్ సిటీ సీటుపై గురిపెట్టారు. అది చాలదన్నట్టు ఇప్పుడు రేసులో మరో ఇద్దరు బలిజ నాయకులు వచ్చి మేమున్నామని హోరెత్తిస్తున్నారు. వారిలో వైసిపి నుండి జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు ఒకరైతే…మరొకరు గతంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన గంటా నరహరి. ఈ పరిస్థితుల్లో తిరుపతి టికెట్ జనసేనకు కేటాయిస్తే టిడిపిని వీడి ఆ కండువా కప్పుకునేందుకు కూడా నరహరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే స్దానిక నేతల ఆగ్రహానికి కారణమవుతోందట. ఇప్పటికే పలు రకాలుగా ఐవిఆర్ ఎస్ సర్వేలు చేసిన పార్టీ పెద్దలు ఇప్పుడు నాన్ లోకల్ పేర్లు తెరపైకి తేవడాన్ని స్దానిక నేతలు నిర్ణయించుకొలేకపోతున్నారట… ఇస్తే తిరుపతి స్దానిక నేతలకే సీటు ఇవ్వాలని గట్టిగానే తమ సందేశాన్ని ఇరు పార్టీల పెద్దలకు పంపునట్లు సమాచారం. ఒకవేళ లోకల్ అభ్యర్ధికి కాకుండా బయటికి వారికిస్తే గెలుపు కష్టంగా మారడంతో పాటు తాము ఎవరం పనిచేయలేమని తెల్చిచెప్పారట. ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్. అసలే రాష్ట్రంలో ఎక్కడ లేనివిదంగా తిరుపతి సీటుకు పోటీ నెలకొన్న క్రమంలో అభ్యర్థి విషయంలో ఇరుపార్టీల నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం.