
Good News to Contract Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. ఇచ్చిన మాట ప్రకారం.. కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎం ఆదేశాల మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్ 1వ తేదీ నాటికి.. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ అర్హులైన 2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు.. ఇక, పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2,025 మంది వైద్య సిబ్బంది ఉందడగా.. డీఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరించారు.. మొత్తంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Read Also: Big Breaking: ఉమెన్స్ డే కానుక.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు