
TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చారు.. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది. మధ్యాహ్నం లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నమాట.. ఇక, నిన్న రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. అయితే, ఆ చర్చల వివరాలను నేడు ఏపీ బీజేపీ నేతలతో చర్చించనున్నారు పార్టీ పెద్దలు.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు.
Read Also: Samantha : హాట్ అందాలతో సమంత బోల్డ్ ట్రీట్.. దారుణంగా ట్రోల్స్..
మొత్తంగా ఏపీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న పొత్తులకు నేడు తెరపడనుంది.. ఢిల్లీలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఈ భేటీల్లో ఏపీలో సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చాయి టీడీపీ-జనసేన-బీజేపీ.. కాళహస్తి, జమ్ములమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ(నార్త్), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, బీజేపీకి ఐదు లోకసభ స్థానాలు కేటాయించడంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారట.. తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం లోక్‌సభ స్థానాల నుంచి బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపనుండగా.. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ రోజు పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత సీట్ల వ్యవహారం తేలబోతోంది అంటున్నారు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండబోతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.