Leading News Portal in Telugu

TDP-BJP-Janasena: రేపు టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి సమావేశం..



Babu

రేపు టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. అందుకోసమని.. రేపు ఉదయం హైదరాబాదు నుంచి రానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేయనున్నారు. రేపటి మూడు పార్టీల అగ్ర నేతల భేటీలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పాల్గొననున్నారు.

ఇప్పటికే షెకావత్ – పవన్ మధ్య భేటీ జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన – బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. పాడేరు, విశాఖ నార్త్, పి. గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లె, కాళహస్తి, కైకలూరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనే ప్రతిపాదనను బీజేపీ పెట్టినట్టు సమాచారం. ప్రతిపాదిత స్థానాల్లో నుంచి ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి బీజేపీ – జనసేన వచ్చినట్లు తెలుస్తోంది. రేపు చంద్రబాబుతో భేటీలో సీట్ల సర్దుబాటుపై షెకావత్, పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. రేపు లేదా ఎల్లుండి సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.