Kakani Govardhan Reddy: జగన్ ప్రజల చుట్టూ తిరుగుతుంటే.. పొత్తుల కోసం చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతున్నారు..

Pawan Kalyan and Chandrababu: మెదరమెట్లల్లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది అని రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మా కుటుంబం 60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉందన్నారు. ఎన్నో సమావేశాలు, సభలు చూసాను.. కానీ సిద్ధం సభకు మా నేతలు ఆడిగినన్ని వాహనాలు ఇవ్వలేకపోయాం.. చాలా మందికి నిరాశ కలిగింది.. నా జీవితంలో మొదటి సారి ఇలాంటి స్పందనను చూస్తున్నాను.. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సిద్ధం సభ రికార్డును సృష్టించింది.. జగన్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు జగన్ కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో తరలి వచ్చారు.. టీడీపీకి చెందిన వారు కూడా సభకు వచ్చారు.. ఈ మీటింగ్ కు వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబుకు గ్యాస్టిక్ ట్రబుల్ వచ్చింది అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చురకలు అంటించారు.
Read Also: Niranjan Reddy:సైలెంటుగా కొత్త సినిమా రిలీజ్ కి రెడీ చేసిన హనుమాన్ నిర్మాత..
గ్రాఫిక్స్ ద్వారా అధికంగా ప్రజలు వచ్చినట్లు చూపించారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. గ్రాఫిక్స్ కు ఆద్యుడు చంద్రబాబే, రాజధానిని వివిధ కోణాల్లో చూపించారు.. చంద్రబాబుకు ఎప్పుడూ విశ్వసనీయత లేదు.. చంద్రబాబు నిర్వహిస్తున్న “రా కదలిరా” సభల్లో ప్రజలను చూపించరు.. ఎందుకంటే ఖాళీ కుర్చీలు ఉంటున్నాయి అని ఆయన అన్నారు. జగన్ ప్రజల చుట్టూ తిరుగుతుంటే పొత్తుల కోసం ఢిల్లీలో చంద్రబాబు తిరుగుతున్నారు అని మంత్రి ఆరోపించారు. జనం లేని దానికి సేనాని పవన్ తో కలిశారు.. ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నారు అంటూ మండిపడ్డారు. మోడీని రకరకాలుగా తిట్టి.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శించి ఇప్పుడు ఆయనతోనే కలుస్తున్నారు అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read Also: Dwarampudi Chandrasekhar: పవన్ కాకినాడ ఎంపీగా కాదు.. నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేయాలి..
నరహంతకుడు మోడీ అని చెప్పి ఇప్పుడు ఆయన చుట్టూ చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. 2014 ముగ్గురూ కటయ్యారు.. 2019లో విడిపోయారు.. జగన్ ను ఓడించాలానే లక్ష్యంతోనే మళ్లీ ముగ్గురూ కలుస్తున్నారు.. ప్రతి సర్వేలో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుందని వెల్లడవుతోంది.. గతంతో పోలిస్తే వైసీపీ ఇంకా బలంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సునామి సృష్టించి విజయ దుందుభిని మోగించనుంది అని రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు.