Leading News Portal in Telugu

MLA Varaprasad Rao Meets Purandeswari: పురంధేశ్వరితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ..



Mla Varaprasad Rao

MLA Varaprasad Rao Meets Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు తర్వాత ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి.. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, నేతలు.. పార్టీ అధ్యక్షులను కలుస్తూ వస్తున్నారు.. ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాద్.. వైసీపీకి రాజీనామా చేసిన వరప్రసాద్‌.. ఇటీవలే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ని కలిశారు.. అయితే, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.. దీంతో ఈ రోజు ఆయన పురంధేశ్వరితో సమావేశం అయ్యారు.. పొత్తు అనంతరం బీజేపీ నుంచి తిరుపతి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారట వరప్రసాద్.. అంతేకాదు.. గతంలో తిరుపతి ఎంపీగా వైసీపీ తరఫున గెలిచారు వరప్రసాద్.. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికల ముందు మార్పులు, చేర్పులు.. కొందరు సిట్టింగులకు సీట్లు లేకుండా చేశాయి.. దీంతో.. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనతోకి టచ్‌లోకి వెళ్లినా.. ఇప్పుడు పొత్తుల అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిని కలవడం చర్చగా మారింది.. ఇక, తిరుపతి పార్లమెంటు పరిధిలో వరప్రసాద్ కు ఉన్న బలం.. బలగం పై పురంధేశ్వరి, బీజేపీ ఎన్నికల సమన్వయకర్త శేఖర్ జీతో చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.

Read Also: Upasana Konidela : అయోధ్యలో అపోలో హాస్పిటల్ సేవలు ప్రారంభించిన ఉపాసన