Leading News Portal in Telugu

Pawan Kalyan: అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం.. మరో ఐదు స్థానాలపై పవన్‌ క్లారిటీ..!



Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్‌ పెట్టాయి.. పొత్తులపై సందిగ్ధత తొలగిపోవడం.. ఏఏ సీట్లు అనేదానిపై కూడా క్లారిటీ రావడంతో.. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు.. పోటీ చేసే అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు.. తాజాగా మరో ఐదు స్థానాలపై స్పష్టత ఇచ్చారు జనసేనాని.. భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, రాజోలు స్థానాల అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్‌.. తాజాగా ఐదు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత ఇవ్వడంతో.. మొత్తం జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 11 స్థానాలపై నిర్ణయానికి వచ్చినట్టు అయ్యింది..

Read Also: Nandamuri Vasundhara Devi: భారీ మెజార్టీతో బాలయ్య విజయం సాధిస్తారు.. హ్యాట్రిక్‌ కొడతారు..

ఇక, తాజాగా పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చిన ఆ ఐదు నియోజకవర్గాలు.. అభ్యర్థుల పేర్ల విషయానికి వస్తే.. భీమవరం – రామాంజనేయులు, రాజోలు – వర ప్రసాద్, నరసాపురం – బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు – ధర్మరాజు, తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లను ఖరారు చేశారట.. దీనిపై ఆయా అభ్యర్థులకు పవన్‌ కల్యాణ్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని.. ప్రచారాన్ని ముమ్మరం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచించినట్టుగా సమాచారం. కాగా, ఏపీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుండగా.. మరోసారి ఒంటరిగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతోన్న విషయం విదితమే.