Leading News Portal in Telugu

Pemmasani Chandra Sekhar: ఇప్పటంలో విస్తృతంగా పెమ్మసాని ప్రచారం



Pemmasani

Pemmasani Chandra Sekhar : గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ను బరిలోకి దిగిన విషయం విదితమే.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తోంది.. ఇక, ఎన్నికల ప్రచారంలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్‌.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం జగన్‌ వైఫల్యాలపై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని.. మిత్ర పక్షాలకు చెందిన అభ్యర్థులకు విజయాన్ని కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ రోజు.. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు పెమ్మసాని.. ‘సీబీఎన్‌ కి నా మొదటి ఓటు’ పేరుతో కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఓటుకున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకులను ఎన్నుకోవాలని.. విద్యావంతులకు తగిన ఉద్యోగాలు కల్పించే నేతలకు అండగా ఉండాలని సూచించారు. మరోవైపు.. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో పెమ్మసాన్ని చంద్రశేఖర్‌ విస్తృతంగా పర్యటించారు.. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి.. గ్రామంలో తిరుగుతూ.. అందరినీ ఆప్యాయంగా పలకరించారు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. కొందరు రోగులను పరామర్శించి.. ఏం మద్దులు వాడుతున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉండాలని.. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు పెమ్మసాని చంద్రశేఖర్‌.