Leading News Portal in Telugu

Ugadi Mahotsavam in Srisailam: ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు..



Srisailam

Ugadi Mahotsavam in Srisailam: ప్రముఖ శైవ క్షేత్రం ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.. ఇక, ఉగాది వేళ నిర్వహించే మహోత్సవాలకు సిద్ధం అవుతోంది శ్రీశైలం ఆలయం.. శ్రీశైలంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన సిబ్బంది, స్థానిక పోలీసులతో సమావేశం నిర్వహించారు ఈవో పెద్దిరాజు.. ఉగాది మహోత్సవాల వేళ భక్తులు వారం రోజుల ముందు నుండే క్షేత్రానికి వస్తారని అధికారులు అంచనా వేశారు.. పాదయాత్రగా వచ్చే కన్నడ భక్తులకు భీమునికొలను, కైలాసద్వారంలో 8 సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కన్నడ భక్తులకు తాత్కాలిక వసతి, త్రాగునీరు, విశ్రాంతి షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 29 లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.. క్షేత్రంలో సమాచార, కన్నడ భాషలో సూచిక బోర్డ్స్ పెట్టాలని అధికారులకు సూచించారు ఈవో పెద్దిరాజు.. కాగా, ఉగాది మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో కన్నడ భక్తులు తరలివస్తుంటారు.. పాదయాత్రగా బయల్దేరి శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటారు.. ఈ సమయంలో శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది..

Read Also: CAA: సీఏఏ దరఖాస్తుదారులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్