Leading News Portal in Telugu

Temperature: నిప్పుల కొలిమిగా నంద్యాల.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు



High Temperature

Temperature: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. ఇక, ఈ రోజు నంద్యాల నిప్పుల కొలిమిగా మారింది.. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ రోజు నంద్యాలలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వెల్లడించారు అధికారులు.. గత రెండు రోజులుగా 40 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతూ వస్తుండా.. నేడు అదనంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 41.5 డిగ్రీలకు చేరింది.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.. ఎండల తీవ్రతతో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపైకి రాలేని పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.. అయితే ఎండలు రికార్డుస్థాయిలో నమోదు అవుతుండడంతో.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Read Also: Dharmana Prasada Rao: ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని మేం చెప్పాలా..? ఓటేస్తారా..? ద్రోహం చేస్తారా..?