Leading News Portal in Telugu

Nandamuri Vasundhara Devi: భారీ మెజార్టీతో బాలయ్య విజయం సాధిస్తారు.. హ్యాట్రిక్‌ కొడతారు..



Nandamuri Vasundhara Devi

Nandamuri Vasundhara Devi: మరోసారి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు నటసింహం, సిట్టింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు.. ఇక, ఆయన సతీమణి వసుంధర దేవి నియోజకవర్గంలో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపేలా పనిచేస్తున్నారు.. ఇక, ఈ రోజు నియోజకవర్గంలో పర్యటించిన వసుంధర దేవి.. హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది బాలకృష్ణే అన్నారు.. భారీ మెజారిటీతో మరోసారి విజయం సాధిస్తారు.. హ్యాట్రిక్‌ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.. నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉచితంగా తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.. ఆసుపత్రిని అభివృద్ధి చేశాం.. మొబైల్ఆరోగ్య సేవలు, క్యాన్సర్ చికిత్స అందించిన ఘనత కూడా నందమూరి బాలకృష్ణదే అన్నారు ఆయన సతీమణి వసుంధర దేవి. కాగా, ఇప్పటికే రెండో సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు మూడో సారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక, అటు చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంతో పాటు.. బాలయ్య నియోజకవర్గంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వరుసగా ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read Also: Rabies: కుక్కకాటు తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నా దక్కని ప్రాణం.. రేబిస్‌తో మహిళ మృతి..