Leading News Portal in Telugu

Jaleel Khan: బెజవాడ పశ్చిమలో కీలక పరిణామాలు.. ఇండిపెండెంట్‌గా బరిలోకి జలీల్ ఖాన్..!



Jaleel Khan

Jaleel Khan: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయా పార్టీల మధ్య చిచ్చు పెడుతోంది.. ఆయా సీట్లను ఆశిస్తున్న నేతలకు చివరి నిమిషంలో సీటు లేదనే సమాచారం ఇవ్వడం ఒకవైపు అయితే.. ఆ స్థానం ఫలానా పార్టీకి కేటాయిస్తారనే ప్రచారంతో కూడా నేతల్లో ఆందోళన మొదలైంది.. ఈ దశలో బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. పశ్చిమ సీటులో ఇప్పుడు కూటమిలో చిచ్చు పెడుతోంది.. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.. బెజవాడ పశ్చిమ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్.. అయితే, సీటు జనసేనకు ఇస్తామని అధిష్టానం చెప్పటంతో కాస్త వెనక్కి తగ్గారు నేతలు.. తాజాగా సీటు జనసేనకు కాకుండా బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.. దీంతో జనసేన నేత పోతిన మహేష్ వర్గం ఆందోళనలకు దిగింది.. మరోవైపు.. కార్యకర్తల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని జలీల్ ఖాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. కార్యకర్తలతో ఈ రోజు సమావేశమైన ఆయన.. ఈ భేటీలో కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలు ఉన్నారని ప్రచారం సాగుతోంది.

Read Also: Yediyurappa: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. దర్యాప్తును సీఐడీకి అప్పగింత