Leading News Portal in Telugu

Bode Prasad: చంద్రబాబుతో ముగిసిన భేటీ.. వెనక్కి తగ్గని బోడే ప్రసాద్..



Bode Prasad

Bode Prasad: పెనమలూరు సీటు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు ఈ సారి టికెట్‌ లేదనే సంకేతాలు ఇచ్చింది టీడీపీ అధిష్టానం.. దీంతో.. బోడే ప్రసాద్‌ వర్గీయులు ఆందోళనకు దిగారు.. ఇక, టికెట్‌ తనకే ఇవ్వాలని.. లేదంటే చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గా నైనా పోటీకి రెడీ అని ప్రకటించారు బోడే ప్రసాద్.. ఆ తర్వాత టీడీపీ అధిష్టానం నుంచి ఆయన పిలుపు వచ్చింది.. అయితే, పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా వెనక్కి తగ్గడంలేదు బోడే ప్రసాద్.. ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకుని పోటీ చేస్తానని ప్రకటన చేశారు..

Read Also: Om Bheem Bush Trailer: ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్.. ఏం కామెడీ ఉంది మావా.. నవ్వి నవ్వి చచ్చిపోతారు

చంద్రబాబుతో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాను అని తెలిపారు.. చివరికి క్షణంలోనైనా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను అన్నారు. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ, న్యాయం జరగకపోతే ఏం చేయాలనేది కార్యకర్తల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తేల్చేశారు. టికెట్ నాకే ఇవ్వాలని నేను అడుగుతున్నాను.. నేనే పోటీ చేస్తానని చెబుతున్నాను. చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. బీఫామ్ ఇస్తే పార్టీ జెండా పెట్టుకుని ముందుకు వెళ్తాను.. ఇవ్వకపోతే చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను.