
ఏపీపీఎస్సీలో అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తి చేశారు. 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్‌లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 వాల్యూయేషన్‌లో అక్రమాలపై ఆధారాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువతను దగా చేసిందని ఆరోపించారు. ఏపీపీస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని, కృూర మృగాల మాదిరి పిల్లల జీవితాలను నాశనం చేశారన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్రంలో కీలక పోస్టులను భర్తీ చేస్తారని, వివిధ కీలక శాఖల్లో కీలక పోస్టుల్లో ఏపీపీఎస్సీని ఎంపిక చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఐటీలో కోట్లాది రూపాయలు జీతాలొచ్చే అవకాశం ఉన్నా.. ప్రజలకు సేవ చేయడం కోసం గ్రూప్ పరీక్షలు రాస్తారని, ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకంలో కాంప్రమైజ్ ఉండకూడదన్నారు.
PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..
అంతేకాకుండా.. ‘మా హయాంలో ఉదయ్ భాస్కరుని నియమించాం. డీజీపీగా తప్పుడు పనులు చేసిన గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మనుగా నియమించారు. ఏపీపీఎస్సీని వైసీపీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను నేను విమర్శిస్తే.. అక్కడి నుంచి తప్పించి ఏపీపీఎస్సీ ఛైర్మనుగా నియమించారు. సలాం బాబు, సుధాకర్ రెడ్డి, సుధీర్ వంటి వైసీపీ నేతలను ఏపీపీఎస్సీలో సభ్యులుగా చేర్చారు. చెత్త మెంబర్లను నియమించి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసిన వాళ్లని జైళ్లల్లో పెట్టాలి. పిల్లల జీవితాలను.. తల్లిదండ్రుల కలలను నాశనం చేశారు. 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలకు పాల్పడ్డారు. డిజిటల్ వాల్యూయేషన్.. మాన్యువల్ వాల్యూయేషన్ అంటూ రకరకాలుగా వాల్యూయేషన్ చేశారు. ఓసారి వాల్యూయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారు.? సీతారామాంజనేయులే రెండో సారి వాల్యూయేషన్ జరపాలని లేఖ రాశారు. పైగా రెండోసారి వాల్యూయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారు.కోర్టులంటే కూడా భయం లేదు. ఏపీపీఎస్సీ పోస్టులను అమ్ముకున్నారు. తాడేపల్లి ప్యాలెస్సులో ఇచ్చిన లిస్టులో ఉన్న వారికి పోస్టింగులు వచ్చేలా చేశారు. ఈ మేరకు మరోసారి మూడోసారి వాల్యూయేషన్ చేశారు. అఖిల భారత సర్వీసెస్ లో ఉండడానికి అనర్హుడు. ఆ సైకో ఎవర్ని చంపమన్నా.. ఈ దుర్మార్గులు చంపేస్తారు. గ్రూప్-1 అభ్యర్థులు చందాలు వేసుకుని న్యాయం కోసం పోరాడారు. ఐదేళ్ల తర్వాత వాళ్లకి న్యాయం జరిగింది.’ అని చంద్రబాబు అన్నారు.
Sircilla Policestation: బట్టలన్నీ విప్పి పోలీస్ స్టేషన్ ముందు హంగామా చేసిన యువకుడు.. చివరకి..?