Leading News Portal in Telugu

MP Magunta Srinivasulu Reddy: నేడు టీడీపీ గూటికి ఎంపీ మాగుంట..



Magunta

MP Magunta Srinivasulu Reddy: ఇటీవలే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ప్రకటించిన విషయం విదితమే.. దానికి అనుగుణంగా నేడు సైకిల్‌ ఎక్కబోతున్నారు ఎంపీ మాగుంట.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి.. వైసీపీలో సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించక పోవటంతో ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.

Read Also: RCB vs MI: 4 పరుగులు ఇచ్చి ఓ వికెట్.. ఆర్‌సీబీ గేమ్ ఛేంజర్ శ్రేయాంక పాటిల్!

మరోవైపు.. తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించానని.. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోనంటూ ఇప్పటికే ప్రకటించారు ఎంపీ మాగుంట.. కానీ, తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. ఎంపీ టికెట్‌పై ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు ముగిశాయని.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఎంపీ మాగుంటకు టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. అది సాధ్యం కాకపోవడంతో.. క్రమంగా వైసీపీకి దూరం అయిన మాగుంట.. ఆ తర్వాత టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు.. ఇక, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన నేపథ్యంలో టీడీపీలో చేరబోతున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించిన విషయం విదితమే.