
క్రికెట్ బెట్టింగ్, పేకాట, సరదాగా ఫ్రెండ్స్ తో వేసే బెట్టింగులను మనం ఇప్పటివరకు చూసే ఉంటాం. మరికొందరు పొలిటికల్ పరంగా కూడా పందాలు కాయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే., ఓ వ్యక్తి వేసిన బెట్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్. ఆ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకి ట్రెండ్ సెట్ చేసాడు అని చెప్పవచ్చు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
Also Read: Naga Chaitanya: ఆ రోజు క్లూస్ ఇస్తా.. మీరు రెడీనా..?
ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఓ వ్యక్తి పందెం వేశాడు. ఒకవేళ వైసిపి అధిష్టానం శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను అరుగుండు, అర మీసం కొట్టించుకుంటానని బెట్టింగ్ వేశాడు. తాజాగా విడుదల చేసిన లిస్టులో శ్రీధర్ రెడ్డికి టికెట్ రావడంతో.. అతను అన్నమాట ప్రకారం అర గుండు కొట్టించుకుని సగం మీసం తీయించుకున్నాడు.
Also Read: PM Modi: వికసిత్ భారత్ మాత్రమే కాదు.. వికసిత్ ఏపీ మా లక్ష్యం
పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇవ్వడంతో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తన నిరసనను విన్నుత్నంగా తెలిపాడు. ఇందులో భాగంగానే పుట్టపర్తి నగరంలోని సత్యమ్మ దేవాలయం ఎదురుగా మహేశ్వర్ రెడ్డి అర మీసం, అరగుండు తీయించుకున్నాడు. తాను అన్నమాట ప్రకారం ఇలా చేశానని.. కాకపోతే., ప్రజలు మాత్రం శ్రీధర్ రెడ్డికి ఓట్లు వేయవద్దని ఆయన కోరాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇదివరకు మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గర కార్ డ్రైవర్ గా పని చేశాడు. ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి చేసిన పనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజెన్స్ మనుషులు పంద్యాలు ఇలా కూడా వేసుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.