Leading News Portal in Telugu

Chandrababu: సమష్టిగా కలిసి పని చేద్దాం.. ఏపీని తిరిగి గాడిలో పెడదాం..



Babu

Chandrababu: పల్నాడు జిల్లాలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైంది.. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌లు ఈ బహిరంగ సభ వేదికగా కీలక ఉపనస్యాలు చేసిన విషయం విదితమే కాగా.. ఇక, ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఏపీ వాసులకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.. సమష్టిగా ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పని చేద్దాం అన్నారు.. ప్రజాగళానికి కదిలి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ప్రజా మద్దతుతో వారి హక్కుల కోసం పోరాడి, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందన్నారు.. కలిసికట్టుగా మనం విజయం సాధిస్తున్నాం అనే ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు..

Read Also: Electoral Bonds : డీఎంకేకి భారీగా విరాళమిచ్చిన లాటరీ కింగ్.. పార్టీకి వచ్చిన వాటిలో ఆయనదే టాప్

కాగా, ప్రాంతీయ ఆకాంక్షలు, దేశ ప్రగతి ప్రాతిపదికన ఎన్జీఏ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న విషయం విదితమే.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చిన ఆయన.. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో విద్యాసంస్థలను కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాం.. తిరుపతిలో ఐఐటీ, ఐఎస్సార్‌, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఐఐపీఈ, ఎయిమ్స్‌ నిర్మించామని, విజయనగరం జిల్లాలో నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం అన్నారు.. మరోవైపు విపక్షాలపై విమర్శలు సంధించిన ఆయన.. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.. ఇక, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావిస్తూ.. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు అని గుర్తు చేశారు.. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న విషయం విదితమే