Leading News Portal in Telugu

Pawan Kalyan: పిఠాపురం పర్యటనకు పవన్‌ కల్యాణ్‌..



Pawan Kalyan

Pawan Kalyan: ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్‌ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెంఇన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్.. పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్‌ కల్యాణ్‌ వస్తుండడంతో.. అంతా ఆసక్తికరంగా మారింది.

Read Also: Lok Sabha Election 2024: ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. రాజకీయ వర్గాల్లో కలకలం

ఇక, పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పెద్దసంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది.. మరోవైపు.. సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారట.. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్ లో ఉన్న పనులుపై దృష్టి సారించనున్న పవన్‌ కల్యాణ్.. వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇక, గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు వచ్చాయట.. మొత్తంగా పవన్‌ కల్యాన్‌ తొలి పర్యటనలో కేవలం జనసేన నేతలతో సమావేశాలకే పరిమితం కానున్నారు.. ఆ తర్వాత పర్యటనలో కూటమిలోని మూడు పార్టీలు (జనసేన, టీడీపీ, బీజేపీ)నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారట పవన్‌ కల్యాణ్‌. కాగా, ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతున్నాయి.. ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడిగా సభలు నిర్వహించగా.. నిన్న బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి సభ నిర్వహించాయి.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభకు హాజరైన విషయం విదితమే.