
Kakani Govardhan Reddy: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలు ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభిస్తున్నారు. వైనాట్ 175 దిశగా ఈ సారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రజలను ఆకట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తు పరంగా వెంకన్నపాలెం గ్రామం నుంచే గత రెండు ఎన్నికలలో ప్రచారాన్ని ప్రారంభించానని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మరోసారి కూడా ఈ గ్రామం నుంచి ప్రచారాన్ని చేపట్టామన్నారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చారని, అందుకే ధైర్యంగా ఇంటింటికి వెళ్లి ఓట్లని అడుగుతున్నామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయని.. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలలో ఇచ్జిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు మరోసారి వాళ్లు ప్రజల ముందుకు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కాకాని సూచించారు.