Leading News Portal in Telugu

Vellampalli Srinivas: పిఠాపురంలో వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యం..



Vellampalli

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు ఓటమి కొత్త కాదు అని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఓట్లే రావు.. వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యం అని చెప్పకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు ఓటమి భయంతోనే భీమవరం, గాజువాక నియోజక వర్గాలను వదిలేసాడు అని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం అయింది కాబట్టే ఏదో ఒక ఆరోపణ చేస్తున్నాడు.. పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చెప్తే ఎంపీ, ఎమ్మెల్యే గానీ పోటీ చేస్తానంట హాస్యాస్పదంగా ఉంది అని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.

Read Also: Abraham Ozler : ఓటిటిలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ విలీనం చేయబోతున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీపాద వల్లబడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడని చెప్పమనండి.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అని జోస్యం చెప్పుకొచ్చారు. ఏపీలో 175కు 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగర వేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.