Leading News Portal in Telugu

Mylavaram: మారిన మైలవరం వైసీపీ పరిశీలకుడు.. కారణం అదేనా..?



Ysrcp

Mylavaram: ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మైలవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ పరిశీలకుడిని మార్చివేసింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో కర్రా హర్షారెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం.. నియమించి నెలరోజులు పూర్తవ్వకముందే అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి ని పరిశీలకుడి పదవి నుండి తప్పించింది అధిష్టానం.. అయితే, అసలు కిరణ్‌ కుమార్‌రెడ్డిని ఎందుకు తొలగించారు? అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.

Read Also: Pawan Kalyan vs Vanga Geetha: పిఠాపురంలో గెలుపెవరిది..? పవన్ కల్యాణ్‌ vs వంగా గీత

ఐ ప్యాక్ టీంతో నియోజకవర్గ కార్యకర్తల గొడవ నేపథ్యంలోనే పరిశీలకుడిని మార్చినట్లు ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న సర్నాల తిరుపతిరావు యాదవ్ ఫొటోల కంటే పరిశీలకుడైన కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలు పెద్దవి పెట్టుకున్నారట.. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా లో పోస్టులు హల్ చల్‌ చేశాయి.. ఇక, ఐ ప్యాక్ టీం రుగ్వేద ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్త పోస్ట్ పెట్టడం కూడా రచ్చగా మారింది.. ఈ విషయమై ఐ ప్యాక్ టీం నాగేంద్ర , రెడ్డిగూడెం మండల పార్టీ కార్యకర్త మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం.. బూతులు తిట్టుకున్న వ్యవహారానికి సంబంధించిన ఆడియో కూడా వైరల్‌గా మారిపోయిందట.. దీంతో.. దిద్దుబాటు చర్యలు చేపట్టిన వైసీపీ అధిష్టానం.. మైలవరం పరిశీలకుడు అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చివేసింది.. ఆయన స్థానంలో కర్రా హర్షారెడ్డిని నియమించినట్టు చర్చ సాగుతోంది.