
Pithani BalaKrishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ.. పవన్ కల్యాణ్‌ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను… కానీ, ఎలాంటి రెస్పాన్స్ రావడంలేదన్నారు.. నన్ను మంత్రి చేస్తాను అన్నారు.. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అన్ని కులాలకు ఆవకాశమిచ్చారు.. కానీ, శెట్టి బలిజలకు ఎందుకు ప్రాధాన్యత లేదు? అని ప్రశ్నించారు.. నాకు సరైన హామీ ఇవ్వకుండా ఎలా పని చేయగలను అంటూ నిలదీశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు నన్ను తమ పార్టీలోకి రావాలని అడుగుతున్నారని తెలిపారు. అయితే, పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం వస్తే.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని ప్రకటించారు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ. కాగా, ఈ మధ్యే సమావేశం నిర్వహించిన పితాని బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న విషయం విదితమే.. నేను, మీరు ఒక్కటే అనుకున్నాను.. కానీ, నాకు సీటు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు. అయితే, గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణనే తొలి అభ్యర్థిగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కానీ, ఇప్పుడు సీటు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పితాని.
Read Also: Group-1 examination: గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు