
Nellore Crime: నెల్లూరు జిల్లాలో దొంగలు తెగబడ్డారు. కావలిలోని వివిధ ఇళ్లలో చోరీ చేసిన బంగారాన్ని నెల్లూరులోని అటికా గోల్డ్‌లో దొంగలు అమ్మినట్లు తెలిసింది. ఈ అమ్మకానికి అటికా గోల్డ్ కంపెనీ ఉద్యోగి సల్మాన్ ఖాన్ సహకరించినట్లు విచారణలో తెలిసింది. చోరీ చేసిన బంగారాన్ని దొంగలు పవన్‌కుమార్, నాగసాయి, శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్‌లు మొదట ముత్తూట్‌లో పెట్టారు.
Read Also: Madhya Pradesh: చర్మం ఒలిచి అమ్మకు చెప్పులు కుట్టించిన కొడుకు..
అనంతరం అటికా గోల్డ్ కంపెనీ ప్రకటన చూసి ఆ సంస్థకు అమ్మితే ఇంకా డబ్బులు వస్తాయని నిందితులు భావించారు. ఈ క్రమంలోనే ముత్తూట్‌లో డబ్బు చెల్లించి అటికా గోల్డ్‌లో బంగారు నగలను విక్రయించడానికి అటికా గోల్డ్ ఉద్యోగి సల్మాన్ ఖాన్‌ను సంప్రదించారు. ఆ బంగారు నగలను విక్రయించడానికి ఆ ఉద్యోగి సహకరించాడు. దొంగలు దొరకడంతో బంగారం ఎక్కడా అని పోలీసులు విచారణ జరపగా ఈ బాగోతం బయటకు వచ్చింది. ఈ క్రమంలో అటికా గోల్డ్ మేనేజర్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.