
Andhra Pradesh: న్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది.. తమ ముందు హాజరై ఆ హింసాత్మక ఘటనలకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించిన సంగతి తెలిసింది. సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఎదుట ఎస్పీలు రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డిలు హాజరయ్యారు.
చాగలమర్రి, గిద్దలూరుల్లోని హత్యలు, మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటనలపై ఎన్నికల సంఘం సంజాయిషీ కోరింది. అసలు ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? విచారణలో ఏం తేలింది? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు? అనే అంశాలపై వారి నుంచి వివరణ తీసుకున్నట్టు సమాచారం. ఘటనకు గల కారణాలు, హింసాకాండకు గల వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాల గురించి సీఈవో ఎస్పీలను వివరణ కోరినట్లు తెలిసింది. హింసని నివారించేందుకు ఎలాంటి చర్యలను తీసుకున్నారనే అంశాన్ని వివరించాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీలు ఇచ్చే వివరణను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ ఎంకే మీనా పంపనున్నారు.
Read Also: Vijayawada West: పవన్ దగ్గరకు చేరిన బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత హింసాత్మక సంఘటనలు జరిగిన మూడు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను గురువారం తన ముందు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ముఖేష్ కుమార్ మీనా సమన్లు జారీ చేశారు.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒకటి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రెండు హత్యలు, కారును తగులబెట్టిన ఘటనలను కమిషన్ సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఈ ఘటనలపై విచారణ నిమిత్తం మూడు జిల్లాల ఎస్పీలను సీఈవో కార్యాలయానికి పిలిపించినట్లు మీనా తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత టీడీపీ కార్యకర్తలపై అధికార వైఎస్సార్‌సీపీ ఈ ఘటనలకు పాల్పడిందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.