Leading News Portal in Telugu

Cash and Liquor Seized: ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు.. భారీగా నగదు, మద్యం పట్టివేత



Cash

Cash and Liquor Seized: ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీగా నోట్ల కట్టలను, మద్యం బాటిళ్లను సీజ్‌ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌ బేగం బజార్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా 30 లక్షల రూపాయలను గుర్తించారు. నగదు రవాణాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని బేగంబజార్‌ పోలీసులకు అప్పగించారు. మైలార్‌దేవ్‌పల్లిలో వాహన తనిఖీలు చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ రాజేంద్రనగర్‌ టీం పోలీసులు.. ఓ బైక్‌లో 17 లక్షల 40 వేల రూపాయల హవాలా మనీని సీజ్ చేశారు. Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌సైబరాబాద్‌ SOT బృందాలు అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ముమ్మర దాడులు చేశాయి. 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 796 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్ల మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మేడ్చల్ SOT టీమ్ పట్టుకుంది.

Read Also:

మరోవైపు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మరోసారి పెద్ద ఎత్తున చీరలను పట్టుకున్నారు అధికారులు. సత్తెనపల్లి శివారు ఇండస్ట్రియల్‌ ఏరియా గోడౌన్‌లో తనిఖీలు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు 30 లక్షల రూపాయలు విలువ చేసే చీరలను సీజ్‌ చేశారు. వీటిని అధికార పార్టీ నేతలు దాచారని భావిస్తున్నారు అధికారులు. చీరలను స్టాక్‌ ఉంచిన వస్త్ర వ్యాపారి భవిరిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశారు. ఒంగోలులో పోలీస్‌, రెవెన్యూ అధికారుల సంయుక్త తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 24 లక్షల 87 వేల రూపాయలను సీజ్‌ చేశారు. ఒంగోలు నుంచి కందుకూరుకు కారులో నగదును తరలిస్తున్న డ్రైవర్‌ దిలీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా నిఘా పెట్టిన అధికారులు..తనిఖీలను రోజురోజుకీ విస్తృతం చేస్తున్నారు.