Leading News Portal in Telugu

AP Elections 2024: ఎన్నికల కోడ్.. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా..



East Godavari

AP Elections 2024: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్నాయి.. అయితే, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో.. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్.. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న ఆయన.. ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.. ట్రోలింగ్, ఆన్‌లైన్‌ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఆయా వాట్సప్, ఫేస్‌బుక్‌ గ్రూప్స్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్.

Read Also: Om Bheem Bush Twitter Review : ‘ఓం భీం బుష్’ కామెడీ అదిరిపోయిందిగా.. సినిమా ఎలా ఉందంటే?

మరోవైపు.. ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా. మాధవీలత.. అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఆ పరిధిలోనే ఉంటారని తెలిపారు.. ఎవరైనా సరే ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే చ‌ర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి, ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా. మాధవీలత.