Leading News Portal in Telugu

Mudragada: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం నేను పని చేస్తా..



Mudragada

బొచ్చు గాళ్ళు వాళ్ళే వారసత్వం చేయాలా? అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. మూడు తరాలుగా రాజకీయాలో ఉన్నాం.. నా కొడుకు ఎందుకు రాకూడదు? అని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లేకుండా ఎవడు పడితే వాడు పార్టీ పెడితే నేను వెళ్ళాలా?.. చిరంజీవి ఓడిపోయాడు, పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు.. ఉద్యమం వలన నేను నష్టపోయాను.. తాను అమ్ముడుపోయి జనాలకు లక్షలు ఇస్తారని ఎలా చెప్తారు? అంటూ ఆయన అడిగారు. గత ప్రభుత్వంలో ఐదు ఏళ్ళు పవన్ ఏ మడుగులో ఉన్నాడు?.. నా శత్రువులతో పవన్ ఎలా కలుస్తాడు.. వైసీపీలో చేరకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ పై పిఠాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాడిని.. పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడు అని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.

Read Also: NDA Alliance: ఏపీలో ఎన్డీయే కూటమి తరపున ఇంకా క్లారిటీ రానీ స్థానాలు ఇవే..!

సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారు అని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ప్రత్తిపాడు నుంచి కాపుల కోసం పని చేయడంతో నా రాజకీయ పతనం ప్రారంభమైంది.. చంద్రబాబు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు.. పవన్ కళ్యాణ్ కాపుల కోసం ఇప్పుడు ఉద్యమం చేయొచ్చు కదా.. సినిమా వాళ్ళు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే పద్ధతి ఉంటుంది.. ద్వారంపూడి కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. వీర మహిళలతో నన్ను తిట్టించి చాలా బాధ పెట్టారు.. జగన్ కి పవన్ కళ్యాణ్ కు చాలా తేడా ఉంది.. 30 ఏళ్ళు జగన్ సీఎంగా ఉంటాడు.. జగన్ ఇప్పుడు పిలిచారు కాబట్టి వెళ్ళాను.. 20 సీట్ల కోసం నేను పవన్ కి ఎందుకు సపోర్ట్ చేయాలి అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం నేను పని చేస్తాను.. ఎంత దూరమైనా వెళ్తాను అని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు.