
చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చేనేత కుటుంబం చనిపోయింది.. బీసీల ఆస్తులను కబ్జా చేసి ఇదేమని ప్రశ్నిస్తే బలి తీసుకుంటున్నారు ఆరోపించారు. బీసీలంటే జగన్ రెడ్డికి గిట్టదు.. ఐదేళ్లుగా బీసీల ఆస్తులను కబ్జా చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కేస్తున్నారు.. సామాజిక న్యాయం మాటలకే పరిమితమా జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. బీసీలపై దమనకాండ ఆపి నిందితులపై చర్యలు తీసుకోవాలి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Read Also: Gaza Crisis : సరిహద్దులో నిలిచిన ట్రక్కులు.. పెరుగుతున్న ఆకలి చావులు
అలాగే, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పటి వరకు నా మీద 15 కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు.. అయితే, పది కేసులే ఉన్నాయని అఫిడవిట్‌లో నమోదు చేస్తే.. తప్పుడు సమాచారం ఇచ్చానని.. నా మీద చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ వాళ్లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే వారు అని ఆయన పేర్కొన్నారు. దీంతో నా నామినేషన్ కూడా తిరస్కరణకు గురయ్యేదన్నారు. అభ్యర్థులు ఇలాంటి ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.. తాను, తన పార్టీ తప్ప రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని జగన్ ప్రయత్నిస్తున్నారు.. అందుకే ప్రజల భవిష్యత్తు కోసం జనసేన- బీజేపీలతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. పొత్తులో భాగంగా కొందరికి సీట్లు రాకపోయినా.. బాధ పడొద్దు.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి న్యాయం జరుగుతుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.